Sachin emotional cries while leaving wankhede

Sachin Emotional cries in Wankhede Stadium, Cricket Stadium, Sachin Tendulkar (Cricket Player), Sachin crying, Tendulkar, last Test, match, Anjali Tendulkar, Sachin family, retires

Sachin Emotional cries while leaving Wankhede, Batting legend Sachin Tendulkar was in tears when he left the Wankhede Stadium in Mumbai for one last time after playing his last International cricket match.

కన్నీరు కార్చిన సచిన్ - ఊహించని అంజలి

Posted: 11/16/2013 12:32 PM IST
Sachin emotional cries while leaving wankhede

రెండు దశాబ్దాల పాటు క్రికెట్ అభిమానుల్ని అలరించిన మాస్టర్ సచిన్ కి నేటితో క్రికెట్ బంధం వీడిపోయింది. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ తరువాత మాస్టర్ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతానని ఇది వరకే ప్రకటించాడు. రెండో టెస్టులో తన అద్బుతమైన ఆటతీరుతో అభిమానుల్ని అలరించిన సచిన్ కి మూడో రోజే వీడ్కోలు పలికారు. వాంఖడేలో మూడో రోజే టెస్టు మ్యాచ్ ని ఇన్నింగ్స్ 126 పరుగులతో గెలిపించి మాస్టర్ కి కానుకగా ఇచ్చారు. మ్యాచ్ విజయానంతరం భారత జట్టు సహచరులు సచిన్ కి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఓ వైపు భారత ఆటగాళ్లు అందించిన ఘన విజయానందం... మరోవైపు ఒక క్రికెట్ మైదానంలో ఆడలేననే భాధ మధ్య సచిన్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు కార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం సచిన్ మైదానం అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. వాంఖడే మైదానం సచిన్ పేరుతో మారుమోగిపోయింది. సచిన్ వీడ్కోలు సమయంలో ప్రక్కనే ఉన్న ఆయన భార్య అంజలి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యి వాటన్నింటిని దిగమింగుకొని కొన్ని విషయాలు చెప్పారు.

మీరందరు క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ ‘గత 24 సంవత్సరాల నుండి క్రికెటే లోకంగా బతికాడు. ఆయన క్రికెట్ ని పూజిస్తాడు, సచిన్ లేకుండా క్రికెట్ ని ఊహించగలను కానీ, క్రికెట్ లేకుండా సచిన్ ని నేను ఊహించడం కష్టం అని తీవ్ర గద్గద స్వరంలో చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ తరువాత ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని అంజలి చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles