తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోధీ, గుంటూరు జిల్లాలో హల్ చల్ చేయటం జరిగింది. చంద్రబాబు, నరేంద్ర మోడీ ల మద్య మంచి సంబందాలు ఉన్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో సైకిల్, కమలం కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈరోజు గుంటూరు జిల్లోని చేబ్రోలు మండలం నారాకోడూరులో చంద్రబాబు, నరేంద్రమోదీ పేర్లతో పోస్టర్లు వెలిశాయి. చంద్రమోదీ యూత్ పేరుతో ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
చంద్రబాబును సీఎం చేద్దాం...రాష్ట్రాన్ని కాపాడుదాం, నరేంద్ర మోదీని ప్రధాని చేద్దాం...దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం...ఇది మన సామాజికి అవసరం అని పోస్టర్లలో రాతలు ఉన్నాయి. ఈ పోస్టర్లను ప్రజలు విచిత్రంగా తిలకిస్తున్నారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో షర్మిల పాదయాత్ర జరుగుతున్న సమయంలో కూడా.. తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు. షర్మిల పాదయాత్రలో కనిపించాయి. జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ ప్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. అప్పట్లో అవి పెద్ద దుమారమే రేపిన విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడు కొత్తగా వెలిసిన చంద్రబాబు-మోడీ ప్లెక్సీల రాజకీయం ఏమిటో? ఈ ప్లెక్సీల దారేటూ పోతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more