No change of cm kiran as pallam raju

no change of cm kiran as pallam raju, minister pallam raju, Pallam Raju, congress party, cm kiran kumar reddy, ap bifurcation,

no change of cm kiran as pallam raju

కిరణ్ ఫై పళ్లం రాజు పగటి మాటలు

Posted: 11/15/2013 01:01 PM IST
No change of cm kiran as pallam raju

కేంద్ర మంత్రి పళ్లం రాజు పగటి మాటలు చెబుతున్నారు. ఒక పక్క తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోస్టు ఊడిపోతుందని మీడియా ముందు తొడలు కొట్టుకుంటు, మీసాలు మేలేస్తూ చెబుతున్నారు. మరికొంతమంది కిరణ్ పోస్టుకు డెడ్ లైన్ పెడుతున్నారు. అయితే కేంద్ర మంత్రి పళ్లంరాజు ఈరోజు మరో విషయం బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చదని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పళ్లంరాజు ప్రారంభించారు.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇప్పటికికూడా పోరాడుతున్నట్లు చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పళ్లంరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నెల 19న జీవోఎం ఎదుట తమ వాదనలు వినిపిస్తామన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజనపై తమదైన శైలీలో ముందుకు వెళ్తుంది. అయితే ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. పళ్లం రాజు చెప్పిన పగటి మాటలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడతున్నారు. సీమాంద్ర ప్రాంతానికే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు సిఎం ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles