Errabelli vs cm ramesh

errabelli vs cm ramesh, Errabelli Dayakar vs CM Ramesh word war, tdp, telangana issue , ap bifurcation, cm ramesh,

errabelli vs cm ramesh, Errabelli Dayakar vs CM Ramesh word war

వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా ‘టి ’రాదు : సీఎం

Posted: 11/15/2013 03:55 PM IST
Errabelli vs cm ramesh

తెలుగుదేశం పార్టీకి విచిత్రమైన కష్టకాలం వచ్చింది. తెలుగుదేశం పార్టీలోని ఇరుప్రాంతాల నాయకులు.. కలిసి సైకిల్ కి గాలి తీస్తున్నారు. ఇక సైకిల్ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. తెలంగాణ ప్రాంత నాయకులు వర్సెస్ సీమాంద్ర నాయకులు . తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం వార్డు సభ్యుడిగా కూడా ఏనాడూ పోటీచేసి గెలవలేని సీఎం రమేష్ ను రాజ్యసభ సభ్యుడిగా చేయడం దురదృష్టకరమని టీడీపీ తెలంగాణ ఫోరం చైర్మన్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.

 

ఇటీవలి కాలంలో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న సీఎం రమేష్.. తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ పనులను తాము అడ్డుకుంటామని ఎర్రబెల్లి హెచ్చరించారు.ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఎర్రబెల్లిని అసలు చదువు సంస్కారం లేని వ్యక్తిగా రమేష్ అభివర్ణించారు.

 

అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఎలా విభజిస్తారని ఆయన ఎర్రబెల్లిని ప్రశ్నించారు. వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా కూడా తెలంగాణ రాదని రమేష్ వ్యాఖ్యానించారు. ఇలా రెండు వైపులా నాయకులు కర్రలు, కత్తులు పట్టుకున్నంత స్థాయిలో రెచ్చిపోతుండటంతో.. ఏం చేయాలో తెలియక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles