Tngos employees new demand on seemandhra employees

TNgos employees new demand on seemandhra employees, TNGOs Demands, Seemandhra Employees, government Employees, secretariat employees

TNgos employees new demand on seemandhra employees

సీమాంద్రులను వెనక్కి పంపండి?

Posted: 11/08/2013 09:56 AM IST
Tngos employees new demand on seemandhra employees

తెలంగాణలోని 10 జిల్లాలకు సీమాంధ్ర జిల్లాలతో ఎలాంటి సరిహద్దు చిక్కులు, అడ్డంకులు లేవని తెలిపింది. ఆంధ్రతో విలీనం చేయడానికి ముందే హైదరాబాద్ దేశంలోనే ఐదో పెద్ద నగరమని, విలీనానికి ముందే నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది.

 

విభజన తర్వాత తప్పని సరిగా రెండు హైకోర్టులు, రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లను, ఇద్దరు గవర్నర్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. నాన్‌లోకల్ పోస్టుల స్థానంలో స్థానికులతోనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరింది. సచివాలయాన్ని రెండుగా చీల్చవద్దని, సీమాంద్రులకు కావాలంటే గచ్చిబౌలి కానీ డీఆర్‌కె భవన్‌ను కానీ కేటాయించాలని నివేదికలో పేర్కొన్నారు. 371-డి అధికరణను కొనసాగించడంపై విభజన తర్వాత ఉద్యోగులు, ఆ రాష్ట్ర ప్రజలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 6 పాయింట్ ఫార్ములా, గిర్‌గ్లానీ కమిషన్ ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం అక్రమంగా తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న 49వేల ఉద్యోగులను గుర్తించి వారి ప్రాంతాలకు పంపాలి అని టీజీవో డిమాండ్ చేసింది.

 

'ముల్కీ నిబంధనలు ప్రకారం కాకుండా జన్మ ద్రువీకరణపత్రాల ఆధారంగా తెలంగాణలో పుట్టని వాళ్లని వాళ్ల జిల్లాకే పంపండి. నాన్‌లోకల్, మల్టీజోన్ ద్వారా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న సీమాంద్రులను వెనక్కి పంపండి ' అని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీజీవో) జీవోఎంకు నివేదిక పంపింది.

 

శతాబ్దాల పాటు తెలంగాణ ప్రజల శ్రమతో నిర్మితమైన నగరాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట సీమాంద్రులు ఆక్రమించారని పేర్కొంది. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉమ్మడి రాజధానికి బదులు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా మార్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. ఇది తెలంగాణ ప్రజలకు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మూడు సంవత్సరాలు మాత్రమే అనుమతించాలని టీజీవో అధ్యక్షుడు వి. శ్రీనివాస్‌గౌడ్, ప్రధానకార్యదర్శి ఎలూరి శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles