Mp siva prasad yama dharma raju drama in chndragiri

MP Siva Prasad Yama Dharma Raju Drama in chndragiri, MP Siva Prasad Yama Dharma Raju Drama Against Telangana,

MP Siva Prasad Yama Dharma Raju Drama in chndragiri, MP Siva Prasad Yama Dharma Raju Drama Against Telangana,

పగటి వేషం కట్టిన చిత్తూరు ఎంపీ

Posted: 11/07/2013 01:34 PM IST
Mp siva prasad yama dharma raju drama in chndragiri

రాజకీయ నాయకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఎన్ని పగటి వేషాలు అయినా వేస్తారు. దీనిని నిదర్శనమే ఈ సంఘటన. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ రకరకాల పగటి వేషాలు వేసి ప్రజల్లో సానుభూతిని పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. గతంలో పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు ఆవరణలో సమైక్యాంధ్రకు మద్దతుగా చెర్నా కోల్ తో కొట్టుకొని వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఎన్నో వేశాలు వేసి నిరసన తెలిపిన ఆయన

నేడు తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి లో తన డ్రామా ట్రూప్ తో కలిసి పగటి పూట యమదర్మరాజు నాటకాన్ని ప్రదర్శించారు. యమధర్మరాజు వేషం ధరించి పాటలు,పద్యాలతో అలరించారు. పోవుతున్నావా?యమధర్మరాజా అంటూ పాటను తెలుగుతల్లి పాత్రదారి తో పాడించారు. రాష్ట్ర విభజన అధర్మంగా జరుతోందని యముడు సైతం సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారనే నాటకాన్ని ప్రదర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడుతామని ఎంపీ శివప్రసాద్ స్పష్టం చేశారు.

మరి ఈయన ఈ పగటి వేశాలు పదవుల కోసం వేస్తున్నాడా ? లేక నిజంగానే సమైక్యవాదం కోరుకుంటున్నాడా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles