20 dead bodies identified in volvo bus accident

20 dead bodies identified in volvo bus accident, Volvo bus accident, dead bodies identified, DNA test, osmania hospital

20 dead bodies identified in volvo bus accident, Volvo bus accident, dead bodies identified, DNA test, osmania hospital

బస్సు ప్రమాద బాధితులు 20 మంది గుర్తింపు

Posted: 11/04/2013 05:55 PM IST
20 dead bodies identified in volvo bus accident

గత నాలుగు రోజుల క్రితం తెల్లవారు జామున మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట మండలం పాలెం గ్రామ శివారులో్ జరిగిన ఘోర వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో చాలా మంది గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారడంతో వాటిని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించి, డీఎన్ఏ పరిక్షల కోసం ఆధారాలు సేకరించి వాటి ఫలితాల ఆధారంగా వారి వారి బందువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

నాలుగు రోజుల అనంతరం డీఎన్ఏ పలితాలు రావడంతో మృతుల్లో 20 మందిని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు నుండి మార్చురీ వద్దే ఉంటున్న వారి బంధువులకు మరికొద్ది సేపట్లో అప్పగించనున్నారు. దీంతో ఎన్ని రోజులు వారు చేసిన శవజాగారానికి విముక్తి కలగబోతుంది. మృతదేహాలను అప్పగించనుండంతో ఆ ప్రాంతం అంతా రోధనలతో దద్దరిల్లుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles