Akhila paksha committee meeting dates confirmed

Akhila Paksha Committee Meeting Dates Confirmed , Nov 12 and 13, central home department, akhila paksha meeting, akhila paksha committee, akhila paksha meeting on division, akhila paksha meeting on telangana, telangana

Akhila Paksha Committee Meeting Dates Confirmed , Nov 12 and 13, central home department, akhila paksha meeting, akhila paksha committee, akhila paksha meeting on division, akhila paksha meeting on telangana, telangana

ఈనెల 12 13 తేదీల్లో అఖిల పక్షం

Posted: 11/04/2013 11:56 AM IST
Akhila paksha committee meeting dates confirmed

యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విభజన పై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న తరువాత విభజన ప్రక్రియకు సంబంధించిన అంశాల పై వడి వడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన అనంతం ఇరు ప్రాంతాల్లో ఏర్పడే సమస్యల పై కేంద్రం అన్ని పార్టీలతో అఖిల పక్షం వేసి, వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని మొన్న కేంద్ర హోంఖ నుండి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు పంపుతూ సెప్టెంబర్ 5లోపు సమాధానం ఇవ్వాలని, అభిల పక్ష తేదీలను ఖరారు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కేంద్రం తాజాగా తేదీలను నిర్ణయించింది. ఈ నెల పన్నెండు, పదమూడు తేదీలలో ఈ సమావేశాలు జరపాలని సంకల్పించింది.అయితే అన్ని పార్టీలను ఒకేసారి కాకుండా వేర్వేరుగా పార్టీలను పిలవాలని నిర్ణయించారు.పన్నెండో తేదీన నాలుగు పార్టీలను,పదమూడు తేదీన నాలుగు పార్టీలను ఆహ్వానించారు. అఖిల పక్షం అంటే అందరితో ఒకేసారి మాట్లాడాలి. కానీ వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం పై ఇక్కడి పార్టీలో అసంత్రుప్తిగా ఉన్నాయి.

అయితే తెలంగాణను వ్యతిరేకించే పార్టీలు కేంద్రహోంఖ కోరిన సలహాలు ఇవ్వడానికి నిరాకరించడంతో రెండు భాగాలుగా కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు సమాధానాలు సిద్దం చేసుకోగా, వైకాపా, టీడీపీ లాంటి పార్టీలు మాత్రం సమాధానం ఇవ్వకూడని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles