Countdown begins for india mars orbiter mission

PSLV C25, India's Mars mission, ISRO, sriharikota, India mars mission, Mars Orbiter, countdown to Mars mission, ,science and technology,space programme,India

The 56 hours and 30 minutes countdown started as per schedule at 06.08 ISROs workhorse launch vehicle PSLV C25.

కౌంట్ డౌన్ మొదలైంది

Posted: 11/04/2013 08:47 AM IST
Countdown begins for india mars orbiter mission

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ఘట్టానికి తెరలేపబోతుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో నుండి మరో అంగారక యాత్రకు శ్రీకారం చుట్టింది. మన దేశంలోనే తొలిసారిగా మానవళికి రోజు రోజుకు ఆసక్తిని పెంచుతున్న అరుణ గ్రహా రహస్యాలను కనుగునేందుకు అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది.

దీనికి సంబందించిన కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 56 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ అనంతరం మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక నింగికి దూసుకుపోనుంది. నవంబర్ 1న సమావేశమైన ప్రయోగ అనుమతి బోర్డు ఈ ఉప గ్రహానికి అనుమతి ఇచ్చింది. ప్రయోగించాక నలభై నిమిషాల ప్రయాణం అనంతరం రాకెట్ ఎంవోఎం ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.

తర్వాత ఇరవై ఇరవైయిదు రోజుల పాటు భూమిచుట్టూ తిరిగే ఉపగ్రహం ఆ తర్వాత అరుణగ్రహం దిశగా యాత్రను మొదలుపెట్టనుంది. డిసెంబర్ 1న మార్స్ వైపు ప్రయాణం ప్రారంభించి 9 నెలల తర్వాత 2014, సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి చేరనుంది. ఈ ప్రయోగం విజయ వంతం అయితే ఇలాంటి యాత్రలు చేపట్టిన అమెరికా, రష్యా, ఐరోపా దేశాల సరసన భారత్ చేరబోతుంది.

ఈ ప్రయోగం కౌంట్ డౌన్ మొదలైనప్పటి నుండి ప్రపంచ దేశాలు దీని పై ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్త్రో ఛైర్మెన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles