T bjp leaders to meet rajnath singh

telangana bjp leaders,rajnath singh,bharatiya janata party,state bifurcation,passing telangana bill,

T BJP Leaders to Meet Rajnath singh, telangana bjp leaders,rajnath singh,bharatiya janata party,state bifurcation,passing telangana bill,

బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణ అసాధ్యం

Posted: 11/02/2013 02:49 PM IST
T bjp leaders to meet rajnath singh

తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు ఈరోజు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీలో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ అంశం పై, పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెడితే ఎలా వ్యవహరించాలనే దాని పై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే వందశాతం మద్దతు ఉంటుందని, తెలంగాణ పై భారతీయ జనతాపార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని రాజ్ సింగ్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత బీజేపీకి 10 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామని తెలంగాణ నేతలు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ను బరిలో దింపేందుకు ఆమెను ఒప్పించాలని తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు రాజనాథ్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన భాజాపా నేత నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణ పై బీజేపీ 2006లో చేసిన తీర్మానానికి కట్టబడి ఉంటామని, భాజాపా మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని, తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని, తెలంగాణ ఏర్పాటులో వెనుకంజ వేస్తే పార్లమెంటులో నిలదీస్తామని నాగం హెచ్చరించారు. భాజాపాతోనే తెలంగాణ సాధ్యం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles