Heavy rains samaikya sankharavam meeting postponed

Heavy rains.. Samaikya Sankharavam meeting postponed. Samaikya Sankharavam meeting on October 26, Samaikya Sankharavam Public Meeting

Heavy rains.. Samaikya Sankharavam meeting postponed. Samaikya Sankharavam meeting on October 26, Samaikya Sankharavam Public Meeting

సమైక్య శంఖారావం సభ వాయిదా ?

Posted: 10/25/2013 11:43 AM IST
Heavy rains samaikya sankharavam meeting postponed

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ లో ఈనెల 26న తలపెట్టిన ‘సమైక్య శంఖారావం ’ సభ వాయిదా పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను సభను నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నా, వారి సభకు వాతావరణం అనుకూలించుట లేదు. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

అదీ కాకుండా సభను నిర్వహించుకునేంత టైం ఇవ్వకుండా రాజధానిలో వర్షం కురుస్తుండటంతో సభను వాయిదా వేయక తప్పదని ఆ పార్టీలో కొంత మంది నాయకులు అంటుంటే మరికొంత మంది నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సభను నిర్వహించి సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాలని అంటున్నారు.

ఒకవైపు సీమాంధ్రలో వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే వారిని ఓదార్చాల్సింది పోయి, సభలు, శంఖారావాలు అంటూ జగన్ పార్టీ గోలేంటి అని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా సభ వాయిదా పడుతుందా ? ఉంటుందా అన్ని మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles