Heavy rains lash andhra paradesh damage crops

Heavy rains, lash Andhra, damage crops, Heavy rains, crop demage, andhra pradesh, agriculture,weather

Heavy rains continued to lash several parts of Andhra Pradesh for the second inundating low lying areas and damaging crops over thousands of acres.

భారీ వర్షాలకు బోరుమంటున్న రైతన్న

Posted: 10/24/2013 08:22 AM IST
Heavy rains lash andhra paradesh damage crops

గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవానాలకు తోడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈశాన్య రుతుపవనాలు కోస్దాంధ్ర, రాయలసీమల్లో మరింత చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో శుక్రవారం ఉదయం వరకూ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ లో కూడా పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి నేటి ఉదయం వరకు రాజధానిలో నిరంతరాయంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడిక్కడ వర్షపు నీరు రోడ్ల మోకాళ్లలోతులో ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

సీమాంధ్రలో 13 జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పత్తి, వరి, చెరకు, పైర్లు,  ఎక్కువగా నీటమునిగాయి. ఆక్వా రైతులు కూడా త్రీవంగా నష్టపోయారు. కూరగాయలు, పండ్ల తోటలకు నష్టం అధికంగా ఉందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కూరగాయల పంటలు దెబ్బతినడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం పై తగు చర్యలు తీసుకోవాని రైతులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles