Centre seeks maharashtra govt s view on reducing sanjay dutt s jail term

Centre seeks Maharashtra govt-s view on reducing Sanjay Dutt-s jail term, Sanjay Dutt case, Sanjay Dutt, 1993 Mumbai serial bomb blasts, Union Home Ministry, Yerawada Central Jail

Centre seeks Maharashtra govt-s view on reducing Sanjay Dutt-s jail term

ఖైధీ నటుడు పై ప్రేమకురిపిస్తున్న కేంద్రం

Posted: 10/23/2013 07:06 PM IST
Centre seeks maharashtra govt s view on reducing sanjay dutt s jail term

టాప్ హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న నటుడు సంజయ్ దత్ పై కేంద్రం ప్రేమ కురిపిస్తుంది. అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితం గడుపుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు శిక్ష తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సంజయ్ కు శిక్ష తగ్గించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందే కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున సంజయ్ కు ఊరట లభించే అవకాశముంది.

 

ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ వద్ద కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్షపడిన సంగతి తెలిసిందే. గత మే 26 నుంచి పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా ఇటీవల పెరోల్ పై బయటకువచ్చాడు. సంజయ్ కాలికి చికిత్స చేయించుకోవడానికి, కుటుంబంతో గడిపేందుకు సెలవు మంజూరు చేశారు.

 

అయితే జైలు శిక్ష పడిన ఖైధీ పై కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రేమ కురిపిస్తున్నారో.. అర్థం కావటంలేదని బీజేపి నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles