Jc diwakar reddy want to contest lok sabha

jc diwakar reddy want to contest lok sabha, jc diwakar reddy, congress party, lok sabha seat, jc diwakar reddy join to TDP, telugudesam party, 2014 election,

jc diwakar reddy want to contest lok sabha

జేసీ దివాకర్ కొత్త కోరిక..

Posted: 10/23/2013 01:19 PM IST
Jc diwakar reddy want to contest lok sabha

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడికి కొత్త కోరిక పుట్టింది. త్వరలో ఆ కోరికను తీర్చుకోవాలని ఆశపడుతున్నట్లు ఈ రోజు మీడియా ముందు చెప్పటం జరిగింది.వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

 

తనకు తెలుగు దేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని జేసీ తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు వెళ్లే యోచనలో ఉన్నారు.

 

అనంతపురం జిల్లాలో ఎదురులేని నేతగా పేరుపొందిన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా కూడా పని చేశారు. అయితే కొంతకాలంగా జేసీకి సొంత ఇలాకాలోనే పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.మంత్రి రఘువీరారెడ్డితో ప్రచ్చన్నంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా గతంలో జేసీ కుటుంబం రాకను స్వాగతించారు.మరి వచ్చే ఎన్నికల్లో జేసీ సైకిల్ ఎక్కుతారా లేదా అనేది తేలాలంటే 2014 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

అంటే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కోరిక తీర్చుకోవటానికి .. తెలుగుదేశం పార్టీలో ఉపయోగపడుతుందనే మాటలు.. స్వయంగా ఆయనే చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles