Devarakonda conflicts 144 section imposed

Devarakonda Conflicts 144 Section Imposed, Devarakonda, Nalgonda district,

Devarakonda Conflicts 144 Section Imposed

ఘర్షణ..144 సెక్షన్ అమలు..

Posted: 10/16/2013 08:03 AM IST
Devarakonda conflicts 144 section imposed

నల్గొండ జిల్లా దేవరకొండలో 144 సెక్షన్ విదించారు. దేవరకొండలో జెండా ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఐ గాలిలోకి కాల్పులు జరపడంతో ఓ బల్లెట్ పొరపాటున కానిస్టేబుల్ కాలికి తగలడంతో గాయమైంది. . ఓ వర్గానికి చెందిన జెండా ఏర్పాటు విషయంలో రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొందరు వ్యక్తులు మరో వర్గానికి చెందిన వ్యాపార సంస్థలపై రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో సీఐ రవికుమార్ గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. పొరపాటున ఓ బుల్లెట్ కానిస్టేబుల్ వెంకట్ నాయుడు కాలికి తగిలి గాయమైంది. ఘర్షణలోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles