Seemandhra electricity employees call off strike

seemandhra electricity employees call off strike, Seemandhra, Telangana, Rayalaseema, coastal Andhra, cyclone Phailin, Kiran Kumar Reddy, anti-bifurcation protests, Samaikyandhra, APTransco

seemandhra electricity employees call off strike

సమ్మె విరమించిన ఉద్యోగులు

Posted: 10/10/2013 03:29 PM IST
Seemandhra electricity employees call off strike

సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో విద్యుత్ జేఏసీ సమ్మె విధించిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా విద్యుత్ కార్మికులు సమ్మె చేస్తే ఎలాంటి ఉంటుందో.. కేంద్రానికి, రాష్ట్రానికి బాగా అర్థమైంది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం సీమాంద్ర విద్యుత్ జేసీతో చర్చలు జరపటానికి సిద్దమైంది. ఈరోజు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం హామీ మేరకు. ఫైలిన్ తుపాను, పండుగల సందర్భంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు.

 

 

అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి విధులకు హాజరు అవుతున్నట్లు విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమ్మె విరమించలేదని... తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే సమ్మెను వాయిదా వేసినట్లు తెలిపారు. తమ ఉద్యమంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చిందని భావిస్తున్నామన్నారు. మూడు విడతలుగా సీఎంతో చర్చలు జరిపినట్లు విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అవసరం అయితే మళ్లీ ఉద్యమిస్తామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles