4 seemandhra mantris quit posts

Pallam Raju, Chiranjeevi, D. Purandeswari, Kotla Surya Prakash Reddy, resignations,

Seemandhra Union ministers met Prime Minister Dr Manmohan Singh on Monday evening and submitted their resignations in person.

వీళ్ళు అధిష్టానాన్ని ధిక్కరించి

Posted: 10/08/2013 08:47 AM IST
4 seemandhra mantris quit posts

సమైక్యాంధ్రలో ఉద్యమంలో జోరు పెరగడంలో ఎట్టకేలకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల్లో కొంత మందికి కదలిక వచ్చింది. కొంత మంది మంత్రులు అధిష్టాన బుజ్జగింపులకు లొంగి రాజీనామా సమర్పించక పోగా, మరికొంత మంది అధిష్టానాన్ని దిక్కరించి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాజీనామాలు సమర్పించారు. గత కొన్ని రోజుల నుండి రాజీనామాలు చేయాలా ? వద్దా అంటూ డైలామా పడుతూ వచ్చిన కేంద్రమంత్రులు చిరంజీవి, పల్లంరాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురంధరీశ్వరి తమ రాజీనామాలను ప్రధానికి సమర్పించి వాటిని ఆమోదించాలని కోరారు.

అదే ప్రాంతం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, రాజీనామాలు సమర్పించలేదు. నిన్న ప్రధానితో భేటీ అయిన మంత్రుల్లో వీరిద్దరు అక్కడే ఉన్నా రాజీనామాలు సమర్పించక పోవడం విశేషం. రాజీనామా ప్రసక్తే లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఢిల్లీలో లేని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్‌చంద్ర దేవ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలంలు రాజీనామా ఊసే ఎత్తడం లేదు. రాజీనామాల సమర్పణ అనంతరం ప్రధానితో వీరి గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర విభజన విషయంలో మేం మోసపోయామని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారని, తక్షణం తమ రాజీనామాలను ఆమోదించాలని, ఇప్పటి నుండి విధులకు హాజరు కాబోమని చెప్పారు.

వీరి ఆవేదనను అంతా మౌనంగా విన్న ప్రధాని ‘తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి ’ మీ సమస్యలు ఏవైనా ఉంటే మంత్రి వర్గ ఉప సంఘంతో చెప్పుకోండి ’ అని ఇంత చెబుతున్నా వినకుంటే ఇక మీష్టం అని ప్రధాని చల్లాగా చెప్పడంతో వారు అక్కడి లేచి వచ్చారు. తాము రాజీనామాలు సమర్పించాం కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చిరు చెప్పాడు. కానీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం తీసుకోదని అన్నారు. వీరు ప్రజల్లోకి వెళితే ప్రజలు వీరిని రానిస్తారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles