Chandrababu naidu is double tongued on division

Digvijay Singh, chandrababu naidu, questions, telangana, samaikyandhra, package, Kiran Kumar Reddy, Digvijaya Singh, chandra babu naidu, Botsa Satyanarayana, దిగ్విజయ్ సింగ్, State Bifurcation

Congress General Secretary in-charge of AP affairs Digvijay Singh took exception on TDP chief Chandrababu Naidu’s indefinite hunger strike on Telangana in Delhi.

డిగ్గీ సెటైర్లకు బాబు మైండ్ బ్లాక్

Posted: 10/07/2013 10:01 PM IST
Chandrababu naidu is double tongued on division

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన తరువాత డిగ్గీ రాజా బాగా ముదిరి పోయాడనిపిస్తుంది.. కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నది అనుకున్నట్లుగా, చెప్పినది చెప్పినట్లుగా చేసుకుంటూ పోతున్న డిగ్గీ రాజా విభజనల అంశం పై రాష్ట స్వపక్ష, విపక్ష నాయకులు ఏ చిన్న మాట మాట్లాడినా వారి పై సెటైర్లు వేస్తూ విసుర్లు విసురుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెదేపా అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఏపీ భవన్ లో దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన పై ఫైర్ అయ్యాడు. 

అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామన్నామని, విభనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబే విభజన పద్ధతి బాగోలేదని చంద్రబాబు అంటున్నారని., అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు విభజన వద్దంటూ దీక్ష చేయడం ఏం బాగోలేదన్నారు. విభజన ఏవిధంగా ఉంటే బాగుంటుందో ఆయనే చెప్పాలన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తమ ఆందోళనలు కేంద్ర మంత్రుల బృందానికి తెలియచేయాలని కోరారు. సీమాంధ్రులు ఆందోళన విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు.  డిగ్గీ రాజా ఇచ్చిన జలక్ లకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందని అక్కడి వారంటున్నారు. డిగ్గీ రాజా ఇలా మాట్లాడటం చూసిన వారు బాగా ముదిరిపోయాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles