Sushil kumar shinde signed on t note

Sushil Kumar Shinde signed on T-Note, manmohan singh, sonia gandhi, sushil kumar shinde, telangana, antony, Sushil Kumar Shinde,Telangana Note

Sushil Kumar Shinde signed on T-Note, manmohan singh, sonia gandhi, sushil kumar shinde, telangana, antony, Sushil Kumar Shinde,Telangana Note

షాక్ ఇచ్చిన షిండే.. టీ నోట్ పై సంతకం

Posted: 10/03/2013 06:05 PM IST
Sushil kumar shinde signed on t note

నేడు రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అంశానికి సంబంధించిన టీ నోట్ పై దోబూచులాట జరిగింది. నేటి ఉదయం నుండే నేడు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంలగాణ నోట్ ని ప్రవేశ పెట్టబోతున్నారని వార్తలు మీడియాలో రావడంతో రాష్ట్రంలోని సీమాంధ్ర నాయకులు కాస్తంత గందరగోళానికి గురయ్యారు కూడ. కానీ హోమంత్రి షిండే మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ టి. నోట్ పై వచ్చిన వార్తలన్నీ ఊహా గానాలే అని, నోట్ పై నేను ఇంకా సంతకం కూడా చేయలేదని అందర్ని చల్లబడేశాడు. కానీ మరికాసేపటికే అందరికి షాక్ ఇస్తూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు.

దీనికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తరువాత  ప్రారంభం అయిన కేబినెట్ మీటింగులలో ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నోట్ లో హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశంలో దీని పై చర్చిస్తారు. మొత్తానికి నోట్ సిద్దం కావడం, దాని పై సంతకాలు కావడం కూడ జరిగిపోయాయి. దాన్ని కేబినెట్ ఆమోదించి, రాష్ట్రపతికి పంపడం అక్కడి నుండి అసెంబ్లీ రావడమే ఆసల్యం. మొత్తానికి తెలంగాణ పై మరికొద్ది సేపట్లో స్పష్టమైన ప్రకటన రాబోతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles