Ap ngo leader ashok babu fire on seemandhra leaders

AP NGO Leader ashok babu fire on seemandhra leaders, Telangana Note, AP NGO Leader ashok , seemandhra leaders, political leaders, Samaikya Rashtra Parirakshana Vedika, Ashok Babu, Andhra Pradesh bifurcation, Ashok Babu, Samaikyandhra agitation

AP NGO Leader ashok babu fire on seemandhra leaders

శుభం కార్డు వేస్తాం : అశోక్ బాబు

Posted: 10/03/2013 07:39 PM IST
Ap ngo leader ashok babu fire on seemandhra leaders

కేబినెట్ నోట్ వస్తుందని తెలిసినాకేంద్రమంత్రులు,ఎంపీలు నోరు తెరవకపోవడం బాధాకరమని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. నోట్ కేబినెట్ కు వస్తే వెంటనే రాజీనామా చేయకపోతే జరిగే పరిణామాలకు తాము బాధ్యలం కాదన్నారు. రాష్ట్ర విభజనను సమర్థించే ఎమ్మెల్యేలు, మంత్రులను సహించేది లేదన్నారు. విభజనను సమర్థించే ప్రతి ప్రజాప్రతినిది రాజకీయ జీవితానికి శుభం కార్టు వేస్తామని అశోక్ బాబు అన్నారు. మంత్రులు తమ పదవులు, స్వార్థం కోం రాష్ట్ర విభజనకు సహకరిస్తే వూరుకోబోమని ఆయన చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రెండు నెలలుగా ఉద్యోగులు కడుపులు మాడ్చుకుని ఉద్యమం చేస్తుంటే.. రాజకీయ నాయకులు మాత్రం పదవులు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర రగులుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. రాజకీయ నాయకులంటే అసహ్యం వేస్తోందని అశోక్ బాబు అన్నారు. వీరిని చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. విభజనను సమర్థించే ఏ రాజకీయ నాయకుడిని అంగీకరించబోమన్నారు. రాజీనామా చేయని నాయకుల రాజకీయ జీవితానికి శుభం కార్డు వేస్తామన్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం తమ దౌర్భగ్యం అన్నారు. వీరిని భరించేందుకు భూమాత కూడా ఒప్పుకోదన్నారు. రాహుల్ గాంధీ మాట కోసం కేబినెట్ నిర్ణయాన్నే చెత్త బుట్టలో వేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా అయోమయంలో ఉందన్నారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులపై యుద్దం ప్రకటిస్తామన్నామరు. అయితే తెలుగు ప్రజలను విడదీయవద్దని రాజకీయ నేతలను కోరుతున్నామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles