Free tea distribution protesting t

Free tea distribution protesting T, Maidukuru Kadapa district, ssamaikyandhra movement, Telangana statehood, cultural programs in samaikya agitation

Free tea distribution protesting T

టి కి వ్యతిరేకంగా టీ పంపిణీ

Posted: 09/29/2013 11:58 AM IST
Free tea distribution protesting t

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సై అన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళన 60 రోజులు దాటింది. వివిధ రకాల ప్రదర్శనలతో తమ ఆందోళన తెల్పుతున్న సీమాంధ్ర ఉద్యమకారులు మామూలుగా చేసే ర్యాలీలు, వంటావార్పులు, బంద్ లు, రాస్తారోకోలు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు, మహిళలతో వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలను చేయిస్తూ రోజుకోరకంగా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా, ఆసక్తి పోకుండా చూస్తున్నారు. 

కడప జిల్లా మైదుకూరులో రాయలోరి కూడలిలో వివిధ కార్యక్రమాలను రాజకీయాలతో సంబంధం లేకుండా జెఏసి నిర్వహించిన ఉద్యమ కార్యకలాపాల్లో అన్ని వర్గాలు, అన్ని రంగాలవారూ భాగం వహించారు.  అందులో భాగంగా ఈ రోజు టీ దుకాణదారులు వినూత్నమైన ప్రదర్శన చేసారు.  అదేమిటంటే ఉచిత పంపిణీ.  మోదుకూరులోని తమ టీ కాఫీ సెంటర్లన మూసివేసి రాయలోరి కూలిలో ప్రత్యేకంగా టీ స్టాల్స్ ను ఏర్పాటు చేసి అక్కడ అందరికీ ఉచితంగా టీ ఇచ్చి తమ నిరసనను వెలిబుచ్చారు.

స్కూల్ పిల్లలు విచిత్ర వేషధారణ, ర్యాలీలు, నృత్య గాన రూపాలలో సమైక్యాంధ్ర కోసం తమ ఆకాంక్షను తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed sends notice to jagan on money laundering
No change of cm kiran vayalar ravi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles