7 seemandhra congress mps firm on quitting

Seemandhra Congress MPs, Lagadapati rajagopal, Rayapati Sambasiva Rao, Seemandhra Congress MPs back track

Seven Congress MPs have decided to meet Lok Sabha Speaker Meira Kumar on Tuesday to submit and press for acceptance of their resignations protesting against the CWC decision to divide the State.

రాజీనామాల పై వెనక్కి... మరింత జాప్యం

Posted: 09/25/2013 08:32 AM IST
7 seemandhra congress mps firm on quitting

గత కొన్ని రోజుల క్రితం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన కొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాల్ని ఆమోదించుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ వారి రాజీనామాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కొన్ని రోజుల కిందటే రాజీనామాలు చేసిన ఎంపీలు వాటిని ఆమోదింపజేసుకునేందుకు మంగళవారం పార్లమెంటుకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇవ్వగా అరగంట ముందే వచ్చిన ఎంపీలు సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. అపాయింట్‌మెంట్ సమయానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లగా.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన స్పీకర్ అటునుంచి అటే పాట్నా వెళ్లారని ఆమె కార్యాలయ సిబ్బంది చెప్పారు. మరి తమకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ సంగతేంటని ఎంపీలు అడగ్గా, తిరిగి 30న రావాలని సూచించారు. అయితే కొంతమంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదంటూ వారికి నచ్చజెప్పేందుకు గత 24 గంటల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం కూడా ఫలించిందని అంటున్నారు. రాజీనామాలకు బ్రేక్ పడటంతో వారు భవిష్యత్తు కార్యచరణ పై చర్చించుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles