Ys jagan walks out of jail after 16 months

YS Jagan walks out of jail ,Jaganmohan Reddy,Jagan Reddy,investments,Andhra Pradesh, chanchalguda

Hundreds of supporters had assembled outside the jail, waiting for the YSR Congress chief's release after he was granted bail in an alleged corruption case.

జైలు నుండి బయటకు వచ్చిన జగన్

Posted: 09/24/2013 05:09 PM IST
Ys jagan walks out of jail after 16 months

అక్రమాస్తుల కేసుకు సంబంధించి గత 16 నెలలుగా చంచల్ గూడ జైలులో శిక్షను అనుభివించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నిన్న సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేడు జగన్ బెయిల్ కి సంబంధించి కోర్టు కోరిన షూరిటీలు, పూచీకత్తులు సమర్పించిన తరువాత విడుదలకు సంబంధించిన ఫైలు పై సంతకం న్యాయవాది సంతకం చేశారు. జగన్ చాలా రోజుల తరువాత బయటకు రావడంతో ఆయన్ను చూడటానికి అభిమానులు బారీ ఎత్తున చంచల్ గూడ జైలుకు తరలి వచ్చారు. జగన్ జైలు నుండి బయటకు రాగానే ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు. జైలు నుండి బయటకి వచ్చిన తరువాత జగన్ ఎప్పటి లాగే చిరునవ్వుతో అభిమానులను పలకరించారు. ఇక ఈయన్ను జైలు నుండి ఇంటికి తరలించడానికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య ఉన్న జగన్ ఇప్పుడు స్వేఛ్చా వాయువులు పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles