Jagan case no quid pro quo with companies cbi

jagan case no quid pro quo with companies cbi, quid pro quo investments in companies, CBI Finds No Evidence Of Quid Pro Quo, YS Jaganmohan Reddy

jagan case no quid pro quo with companies cbi, CBI Finds No Evidence Of Quid Pro Quo

జగన్ కేసు-ఆధారాలు లేవన్న సీబీఐ

Posted: 09/23/2013 03:41 PM IST
Jagan case no quid pro quo with companies cbi

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి అయిందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఈరోజు ఉదయం హైకోర్టుకు సీబీఐ ఒక మెమోను దాఖలు చేసింది. అయితే ఈ కేసులో పలు కంపెనీల్లో క్విడ్‌ప్రోకో జరిగినట్లు అధారాల్లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ కంపెనీ, బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ కంపెనీల్లో క్విడ్‌ప్రోకో ఆధారాలు లేవని సీబీఐ తెలిపింది. అయితే ఈ కేసుల్లో ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, వీటిపై చర్యలకు ఐటీ, ఈడీ విభాగాలకు సిఫార్సు చేసినట్లు సిబిఐ పేర్కొంది. అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి వ్యవహారంపై త్వరలో కోర్టుకు రిపోర్టు చేయనున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles