Ys jagan gets bail

jagan got bail, ys jagan gets bail, bail to jagan, bail to ys jagan mohan reddy, bail to jagan reddy, conditional bail to jagan, ys jagan gets bail

jagan got bail, ys jagan gets bail, bail to jagan, bail to ys jagan mohan reddy, bail to jagan reddy, conditional bail to jagan, ys jagan gets bail

వైయస్ జగన్ కి బెయిల్

Posted: 09/23/2013 05:17 PM IST
Ys jagan gets bail

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో గత 16 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు ఇద్దరు వ్యక్తులు 2 లక్షల చొప్పున పూచీకత్తు ఇవ్వాలనే  షరతుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కి ధరఖాస్తు చేసుకోవద్దని చెప్పడంతో ఇన్ని రోజుల నుండి బెయిల్ కి ధరఖాస్తు చేసుకోని జగన్ ఆ గడువు ముగియంతో ఇటీవలో సీబీఐ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. దీని పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. జగన్ కంపెనీల్లో  అక్రమంగా పెట్టుబడులు పెట్టారంటూ..క్విడ్ అండ్ ప్రో కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని పై సుప్రీం కోర్టు ఆదేశించిన మేరకు విచారణ, దర్యాప్తు జరిపామని, అందులో ఎనమిది కంపెనీల్లో క్విడ్ అండ్ ప్రో జరగలేదని ఈ ఆస్తులకు సంబంధించి విచారణ పూర్తయిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 10 ఛార్జీషీట్లు, 73 మంది పై కేసులు నమోదు చేసింది. బెయిల్పై  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జగన్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారి చేసింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్‌, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు  ఆధారాలు లభించలేదని, 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి  దర్యాప్తు చేస్తున్నాయని  తెలిపింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles