Karnataka minister rathnakar saved six members from sinking car

karnataka minister Rathnakar saved six members from sinking car, minister Kimmane Ratnakar, Kimmane Rathnakar, Karnataka Minister Kimmane Ratnakar, Secondary Education Kimmane, Karnataka government schools, Kimmane Ratnakar

karnataka minister Rathnakar saved six members from sinking car

మునిగిపోతున్న వారికోసం సాహసం చేసిన విద్యాశాఖ మంత్రి

Posted: 09/18/2013 03:07 PM IST
Karnataka minister rathnakar saved six members from sinking car

ఎదుటివారు ఎలా పోయిన పర్వలేదు.. నా ప్రాణాలు పోకుండా ఉంటే చాలు దేవుడా అని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. ఇక రాజకీయ నాయకులైతే చెప్పల్సిన పనిలేదు. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ప్రాణాలు పోయిన పర్వలేదు.. నా కుటుంబం, నా పదవి, నేను ఏమీ కాకుండా ఉంటే చాలు. రాజకీయ పదవి కోసం ఎంతమందినైన ఇబ్బందిపెట్టే రాజకీయ నాయకులను చూసి ఉంటాం. అలాగే ఆస్తులు కూడబెట్టుకోవటానికి కష్టపడే రాజకీయ నాయకులను చూసి ఉంటాం. ఎంతమంది ప్రాణాలు పోయిన పర్వలేదు .. నా ప్రాణాలు కాపాడండని భారీ బందోబస్తు పెట్టుకొని తిరిగే నాయకులను చూసి ఉంటాం. ఇలాంటి రాజకీయ నాయకులకు విరుద్దంగా విద్యాశాఖ మంత్రి ప్రవర్తించి.. తనలో ఉన్న రియల్ హీరోను ప్రజలకు చూపించాడు. కర్నాటక మంత్రి ఆదర్శంగా, స్పూర్తిగా నిలిచిన సంఘటన బెంగళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ చెరువులో మునిగిపోతున్న ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని తన అంగరక్షకులతో కలిసి రక్షించి రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి కిమ్మనే రత్నాకర్ తన వాహనంలో ఉదయం బెంగళూరు నుంచి స్వగ్రామం తిర్థహళ్లికి వెళుతుండగా.. మార్గమధ్యంలో బెగువల్లి వద్ద మారుతి స్విఫ్ట్ కారు నీటిలో మునిగిపోతుండగా గమనించి తన కాన్వాయ్ ను ఆపి.. చెరువులోకి తన అంగరక్షకులతో కలిసి దూకి ఆరుగురిని రక్షించారు. మంత్రి రత్నాకర్ తో గన్ మెన్ హల్ స్వామి, డ్రైవర్ చంద్ర శేఖర్, ఎస్కార్ట్ వెహికిల్ డ్రైవర్ కృష్ణమూర్తి ప్రాణాలకు తెగించి కాపాడారు.

 

తొలుత మంత్రి రత్నాకర్ నీటిలోకి దూకి రియర్ డోర్ ను ఓపెన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకి లాగి..తన అనుచరులతో కలిసి వారిని సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత మళ్లీ నీటిలోకి వెళ్లి 55 ఏళ్ల మహిళతోపాటు మరో ముగ్గురిని కాపాడారు. డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి అపస్మారక స్ఠితిలోకి వెళ్లగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంత్రి రక్షించకపోతే తామందరు ఈ ప్రమాదంలో మరణించే వాళ్లమని.. మంత్రి రత్నాకర్ కు ఎలా కృతజ్క్షతలు తెలియచేయాలో అర్ధం కావడంలేదని బాధితులు అన్నారు. చట్టసభల్లో బ్లూఫిలిం చూసే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో..సాటి మనుషులను కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యని మంత్రులు ఉన్నారని విద్యాశాఖ మంత్రి రత్నాకార్ నిరూపించాడుమంత్రి నియోజక వర్గం ప్రజలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles