Geetha reddy is a9 in cbi chargesheet in jagan assets case

Geetha Reddy is A9 in CBI chargesheet in Jagan assets case, Minister Geeta Reddy in Jagan Case, CBI files 2 new chargesheets

Geetha Reddy is A9 in CBI chargesheet in Jagan assets case

సిబిఐ చేతిలో చిక్కిన గీతారెడ్డి

Posted: 09/17/2013 07:42 PM IST
Geetha reddy is a9 in cbi chargesheet in jagan assets case

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జీషీట్లును నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ సంస్థపై చార్జీషీట్లు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జీషీట్‌లో మొత్తం 14 మందిని నిందుతులుగా పేర్కొంది. మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన పేర్లను అధికారులు చేర్చారు. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి గీతారెడ్డిని ఏ-9గా, దర్మాన ప్రసాదరావు ఏ-11గా సీబీఐ పేర్కొంది. జగన్ కంపెనీల్లో ఇందూ గ్రూప్ రూ. 70 కోట్లును పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ విచారణలో తేల్చింది. ఇందుకు ప్రతిఫలంగా 8848 ఎకరాల భూమిని అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అలాగే శంషాబాద్‌లో ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్టులు నిర్మించి యువతకు వేల ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సంస్థ పేర్కొంది. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది. ఇందూ ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ మంత్రి సబితా రెడ్డిని ఏ-8గా సీబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles