Rayapati planning for new samaikyandhra party

Rayapati Planning For New Samaikyandhra Party. Rayapati Sambasiva Rao Planning For New Samaikyandhra Party,Congrss Leader Sambasiva Rao Planning For New Samaikyandhra Party, Rayapati Sambasiva Rao Plannin

Rayapati Planning For New Samaikyandhra Party. Rayapati Sambasiva Rao Planning For New Samaikyandhra Party,Congrss Leader Sambasiva Rao Planning For New Samaikyandhra Party, Rayapati Sambasiva Rao Plannin

కొత్త పార్టీ పెట్టాకే... రాజీనామాలు

Posted: 09/17/2013 03:41 PM IST
Rayapati planning for new samaikyandhra party

సీమాంధ్ర నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో ఒక్కోనేత ఒక్కో మాట మాట్లాడుతున్నారు. సీమాంధ్ర నాయకులు రాజీనామలు చేయాలని ఏపీ ఎన్జీఓలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నా కానీ సీమాంధ్ర నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా తలో మాట మాట్లాడుతున్నారు. తాజాగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు అనివార్యమైతే  అప్పుడు రాజీనామాలు చేస్తామని, అప్పటి వరకు పదవిలో ఉంటూనే తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని, అవసరమైతే ‘కొత్త పార్టీ పెట్టడానికైనా సిద్దమే ’ అని ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము సోనియా,మన్మోహన్ లను కలిసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.  గత కొన్ని రోజుల నుండి సీమాంధ్ర కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుందనే ప్రచారం సాగుతుంది. వాటికి బలం చేకూర్చే విధంగా రాయపాటి ప్రకటన ఉంది. సీఎంను కలిసిన ఆయన దీని పైనే చర్చించి ఉంటాడని మీడియా వర్గాల టాక్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles