Telangna congress leaders fire on renuka chowday

telangna congress leaders fire on renuka chowday, Renuka Chowdary, Telangana, Seemandhra, Andhra bifurcation, Ponnam Prabhakar

telangna congress leaders fire on renuka chowday

రేణుక చౌదరి పై దాడి చేసిన తెలంగాణ నేతలు

Posted: 09/16/2013 10:13 AM IST
Telangna congress leaders fire on renuka chowday

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి తెలంగాణ సెగ తగిలింది. మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన రేణుకపై కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అమరవీరులకు వ్యతిరేకంగా గతంలో ప్రకటనలు గుప్పించిన రేణుక ఈ సమావేశానికి ఎలా వచ్చారంటూ పొన్నం నిలదీశారు. ఆమె సమావేశంలో కూర్చుంటే తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. పొన్నం హెచ్చరికతో దామోదర్‌రెడ్డి కూడా గొంతు కలిపారు. ఆమెను ఈ సమావేశానికి ఎవరు పిలిచారంటూ ఆహ్వానితులను నిలదీశారు. ఒక దశలో పొన్నం ఊగిపోయి రేణుకపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేణుకను ఆహ్వానించడం ఎంతమాత్రం తగదని అన్నారు. దామోదర్‌రెడ్డి సైతం ఆమెను సమావేశం నుంచి పంపించాలంటూ పట్టుబట్టారు. సీనియర్‌ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిగతా నేతలు జోక్యం చేసుకుని సమావేశం నుంచి వెళ్ళిపోవాలంటే ఎలా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ తుది దశకు చేరిన ఈ సమయంలో ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తగదని వారు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతంలోని విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని, అటువంటి వారిని కించపరిచేలా గతంలో మాట్లాడారని పొన్నం ధ్వజమెత్తారు. రేణుకను సమావేశం నుంచి బయటకు పంపకపోతే తానే వెళ్ళిపోతానంటూ లేచి కూర్చున్నారు. పక్కనే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సర్ది చెప్పడంతో గొడవ కాస్త సుఖాంతమైంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles