Samaikya movement attack on jp lok satta

samaikya movement attack on jp (lok satta), Jayaprakash Narayan Telugu Tejam faces Samaikyandhra heat, Jayaprakash Narayana Telugu Tejam yatra

samaikya movement attack on jp (lok satta), Jayaprakash Narayan Telugu Tejam faces Samaikyandhra heat

సమైక్య సెగ దెబ్బకు మధ్యలోనే జంప్ అయిన జేపీ

Posted: 09/14/2013 04:12 PM IST
Samaikya movement attack on jp lok satta

తెలుగు తేజం యాత్ర మొదలుపెట్టిన లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు కూడా సమైక్య సెగ తెప్పలేదు. ఈరోజు యాత్ర కర్నూలు నుంచి మొదలుకాగా ఆయన పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకొని పార్టీ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జేపీ చేసేది లేక సభను అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయారు. జేపీ నిజానికి.. సమైక్యంగా ఉన్నా, విభజన జరిగినా సామరస్యంగా ఉండాలని, సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని, వాతావరణం చెడగొట్టుకోరాదని ప్రజలకు చెప్పడానికి వెళ్లారు. కాని సమైక్యభావన తీవ్రంగా ఉండడంతో ఆయన యాత్రను కొందరు అడ్డుకున్నారు. జేపీ సమైక్య వాదానికి కట్టుబడి ఉండాలని, తమ వైఖరని చెప్పాలని స్థానికులు అడ్డం తిరిగారు. మొత్తానికి సమైక్య వాదంతో విధి, విధానాలనే జేపీకూడా వెనుదిరగక తప్పలేదు. అనంతరం సమైక్యవాదులు అక్కడి బానర్లను, పార్టీ జెండాలను తొలగించారు. అంతకుముందు జేపీ తన ప్రసంగంలో భాగంగా ఇతర రాజకీయపార్టీలపై తీవ్రంగా మండిపడ్డ సంగతి తెలిసిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles