Apngos future plans

apngos future plans, Apngos samaikyandhra movement, APNGO Association, APNGO Ashok Babu, APNGO Dharnas, Jantarmantar Delhi, Million March

apngos future plans

ఎపిఎన్జివోల భవిషత్ప్రణాళిక

Posted: 09/10/2013 03:04 PM IST
Apngos future plans

ఈరోజు సమావేశమైన ఎపిఎన్జోవోలు తమ ఉద్యమ ప్రణాళికను వివరించారు.  ఈ రోజు నుంచి 12 వ తేదీ వరకు మూడు రోజులు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన సదస్సులను నిర్వహిస్తారు.  అందులో, విభజన వలన జరిగే కష్టనష్టాల గురించి, ప్రస్తుత రాజకీయ సంక్షోభం, నాయకుల విశ్వాసరాహిత్యం వగైరా అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

13 వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా ధర్నాలు నిర్వహిస్తారు.  14న  మహిళా ఉద్యోగులు ర్యాలీ నిర్వహిస్తారు.  15 వతేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 16న సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక విస్తృత సమావేశాలు నిర్వహించబడతాయి. 

హైద్రాబాద్ లో ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్షలతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  పోయిన వారం హైద్రాబాద్ ఎల్ బి స్టేడియమ్ లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతో ఉద్యమాన్నింకా ఉధృతం చేద్దామని నిర్ణయించుకున్న ఎపిఎన్జీవోలు ఆరోజు సభలో చెప్పిన మిలియన్ మార్చ్ విషయంలో ఇంకా ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.  కానీ గ్రామ స్థాయినుంచే ఉద్యమాన్నిఇంకా తీవ్రంగా ఇంకా ముందుకు నడిపించాలన్న తమ కోరికను మాత్రం తెలియజేసారు. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles