Pm candidate decided by rss

bjp pm candidate, pm candidate decided by RSS, Ram Madhav RSS, Narendra Modi, BJP PM candidate Modi

pm candidate decided by RSS

ప్రధాని అభ్యర్థి పేరు ఖరారు చేసిన ఆర్ఎస్ఎస్

Posted: 09/10/2013 05:37 PM IST
Pm candidate decided by rss

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరుని ఖరారు చెయ్యమని కోరింది.  భాజపాని వెనక నుండి నడిపించేది ఆర్ ఎస్ ఎస్ అని ఇక చెవులు కొరుక్కోవలసిన అవసరం లేకుండానే బాహాటంగా సూచనలివ్వటం మొదలుపెట్టిన తర్వాత అద్వానీ రాజీనామా ఉపసంహరహణ విషయంలో కూడా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. 

ఆ ప్రకటన మాత్రం భాజపా స్వయంగా తన ప్రకటనగా తగు సమయంలో చేస్తుందని ఆర్ఎస్ ఎస్ తెలియజేసింది.  ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సర్వేలలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిసిందని చెప్తోంది, ఆ మార్పు కోరుకునేవారు మోదీకే మద్దతునిస్తారని కూడా భావిస్తోంది.

ఈ విషయాన్ని తెలియజేసిన ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ దీన్ని భాజపాతో జరిపిన చర్చలలో ప్రస్తావించటం కూడా జరిగిందని చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles