Will hyderabad be ut

Hydereabad UT, Digvijay Singh, Congress Party, CWC decision for bifurcation, AP State bifurcation, Seemandhra Telangana

will hyderabad be ut

హైద్రాబాద్ ని కేంద్రం పాలిస్తుందా?

Posted: 09/03/2013 05:36 PM IST
Will hyderabad be ut

రాష్ట్ర విభజన జరగాలి, హైద్రాబాద్ మా రాజధాని కావాలి అన్నది తెలంగాణా ప్రజల కోరిక.  రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అన్నది సమైక్యాంధ్ర వాదుల వాంఛ.  ఈ పీటముడిని ఎవరు విప్పుతారు అని కాంగ్రెస్ తలపట్టుకుని కూర్చుంది.  ఆ తర్జన భర్జనలు జరుగుతుండగా మధ్యే మధ్యే వ్యాఖ్యలు సమర్పయామి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మాటలతో కార్చిచ్చు అటో ఇటో రగులుతోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతోంది.  తెలంగాణా వాదుల మాటనూ నెగ్గనిస్తూ సీమాంధ్రులనూ తృప్తి పరచాలంటే ఇప్పటి వరకూ వారి దగ్గరికి వచ్చిన వివరాల ప్రకారం, హైద్రాబాద్ నగరమే వివాదానికి ముఖ్య కారణం కనుక, సమైక్యాంధ్ర కాకపోయినా హైద్రాబాద్ మీద సరైన నిర్ణయం ఇరువైపులా శాంతిని నెలకొల్పుతుందన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. 

మధ్య మధ్య దిగ్విజయ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సొంతమైవుండటానికి అవకాశం లేదు.  అంటే వాటి ప్రభావం ఎలా ఉంటుందా అని చూస్తున్నట్టుగానే ఉంది.  ప్రయోగ శాలలో లిట్మస్ టెస్ట్ చేసినట్టు రాష్ట్ర విభజన మీద దిగ్విజయ్ సింగ్ చేస్తూ వచ్చిన ప్రకటనలు ఏదో ఒక విధంగా రగడ రేపుతూనే వుంది.  అది కాంగ్రెస్ పార్టీకి ఫీడ్ బ్యాక్ లా పనిచేస్తోంది.

అందుకే ఈసారి దిగ్విజయ్ సింగ్ మాటల్లో హైద్రాబాద్ నగరం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూనే తెలంగాణాకు రాజధానిగానూ ఉంటుందన్న హింట్ వస్తోంది.  దాని సాధ్యాసాధ్యాలింకా చూడలేదు కానీ హైద్రాబాద్ ని తెలంగాణాకు పూర్తిగా కట్టబెట్టం అంటూ ప్రకటిస్తే ఎలా ఉంటుందా అని కూడా చూస్తున్నట్టుగా కనపడుతోంది.  దానితో సమైక్యాంధ్రా ఉద్యమం కాస్త చల్లబడి, తెలంగాణా ప్రాంతం నుంచి ఎటువంటి అభ్యంతరాలూ రాకపోతే ఆ దిశగా ముందుకు వెళ్ళవచ్చు అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles