Anantha simha garjana started

Ananthapur lion roars, Employees JAC, Students JAC, Samaikyandhra movement, Seemandhra protests

anantha simha garjana started

ప్రారంభమైన అనంత సింహ గర్జన

Posted: 09/03/2013 11:01 AM IST
Anantha simha garjana started

35 రోజులుగా సాగుతున్న సమైక్యవాదుల పోరాటాన్ని రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రజల మనోభీష్టంగా చాటి చెప్పటమే ధ్యేయంగా ఈ రోజు అనంతపూర్ లో ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో అనంత సింహ గర్జన ప్రారంభమైంది. 

భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించే ఈ సభలో పాల్గొనటానికి వేలాదిగా విద్యార్థులు, సమైక్యవాదులు కదలి వస్తుండటంతో అనంతపూర్ పట్టణం జనసమ్మర్దంతో కిక్కిరిసిపోయివుంది. 

అనంతపూర్ నుంచి సమైక్యవాదాన్ని బలంగా కేంద్రానికి వినిపించటమే లక్ష్యంగా ఏర్పాటు చెయ్యబడ్డ సభ కాబట్టి దీనికి అనంత సింహగర్జన అని పేరుపెట్టామని నిర్వాహకులు వెల్లడించారు.  ఇంతకాలం శాంతియుతంగా ఆందోళన చేసామని, ఇక ముందు ఎలా చెయ్యాలన్నది నిర్ణయిస్తామని కూడా వారు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles