Lepakshi case cbi quizzes minister geeta reddy

lepakshi case cbi quizzes minister geeta reddy, CBI quiz on Geeta, just a formality, Geeta Reddy, CBI,Jagan case, Quizzing, Indu projects , Lepakshi

lepakshi case cbi quizzes minister geeta reddy

సిబిఐ గీతదాటిన గీతారెడ్డి-ప్రశ్నించిన అధికారులు

Posted: 08/28/2013 10:39 AM IST
Lepakshi case cbi quizzes minister geeta reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు పై సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. కొద్ది రోజుల వరకు సైలెంట్ గా ఉన్న సిబిఐ అధికారులు కాంగ్రెస్ మంత్రి అయిన గీతారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డిని సీబీఐ అధికారులు విచారణ జరిపినట్లు సమాచారం. ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అర్థరాత్రి 12 గంటల వరకు ఆమెను ప్రవ్నించినట్లు సమాచారం. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. భూ కేటాయింపులపై సీబీఐ అధికారులు మరికొంతమంది రాష్ట్ర మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. కొద్దిరోజుల క్రితం గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. భూకేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles