Firing on tdp leader tummala nageswara rao and trs leader

Firing on TDP Leader Tummala Nageswara Rao, Firing on TRS Leadera manik reddy, MP Manik Reddy, outer ring road

Firing on TDP Leader Tummala Nageswara Rao and TRS Leader

మాజీ ఎంపీ వాహనంపై కాల్పులు

Posted: 08/28/2013 08:03 AM IST
Firing on tdp leader tummala nageswara rao and trs leader

మాజీ ఎంపి మాణిక్‌ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెరాస వర్గాలు పేర్కొన్నాయి. ఔటర్‌ రింగు రోడ్డుపై కొల్లూరు సమీపంలో రాత్రి ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరిగింది. మాణిక్‌ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి బుల్లెట్‌ గాయమైనట్లు సమాచారం. ఆయనకు ప్రమాదం తప్పినట్లు తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే మాణిక్‌ రెడ్డి నగర పోలీస్‌ కమిషనర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కలకలం రేపిన ఈ కాల్పుల వ్యవహారాన్ని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ ఘటన సంబంధించి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తుమ్మల నాగేశ్వరరావును ఫోన్‌లో ఆరా తీశారు. తెరాస జిల్లా అధ్యక్షుడు ఆర్‌. సత్యనారాయణ ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మాణిక్‌ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఔటర్‌ రింగురోడ్డుపై దెబ్బతిన్న మాట వాస్తవమేనని అటు పోలీసులు ఇటు తెరాస వర్గాలు పేర్కొంటున్నప్పటికీ కాల్పులపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెరాస పేర్కొంటుండగా.. అదంతా ఒట్టిదేనని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా టిడిపిలో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన మాజీ ఎంపి మాణిక్‌ రెడ్డి ఇటీవల తెరాసలో చేరారు. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయనపై ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా ఉంటే.. తాజాగా ప్రచారంలోకి వచ్చిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles