Re breaches 65 mark vs usd down 104 paise in early trade

indian currency market, indian equity market, India forex reserve, indian currency, rupee fall, rupee vs us dollar

Continuing yesterday slide, the rupee today again breached 65-mark against dollar falling sharply by 104 paise to trade at 65.34 on strong.

రూపాయి మళ్లీ టపీ

Posted: 08/27/2013 10:23 AM IST
Re breaches 65 mark vs usd down 104 paise in early trade

వింత రోగానికి మందు లేదు... ఎన్ని చేసినా నయం కాదు అన్న చందంగా ఉంది మన రూపాయి పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు ఏవీ రూపాయి పతనాన్ని ఆపలేకపోతున్నాయి. నిన్న దాదాపు 104 నష్టపోయిన రూపాయి, నేటి ఉదయం కూడా అదే స్పీడులో పడిపోతుంది. దాదాపు 100 పైసల వరకు నష్టపోతుంది. ప్రస్తుతం 65 రూపాయల 30 పైసల వద్ద ట్రేడవుతుంది. రూపాయి పతనం కొనసాగుతుండటంతో ఇటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. నేడు మార్కెట్లు ప్రారంభం అయిన వెంటనే సెక్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి, 18,350కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్ల దాకా కోల్పోతూ 5,410కి సమీపంలో కొనసాగుతోంది. రూపాయి పతనం ప్రభావం వల్ల ఈవారమో.. వచ్చే వారమో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 2, 3 రూపాయలు పెరిగే అవకాశముంది. వీటితో పాటు సెల్‌ఫోన్‌ సహా దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles