Harikrishna fire on sonia gandhi and rahul gandhi

harikrishna fire on sonia gandhi and rahul gandhi, harikrishna fire on sonia gandhi, ap bifurcation, rahul gandhi, congress party, AICC president Sonia Gandhi, harikrishna bus yatra,

harikrishna fire on sonia gandhi and rahul gandhi

రాష్ట్ర విభజన పై హరికృష్ణ కొత్త ఆరోపణ

Posted: 08/23/2013 01:10 PM IST
Harikrishna fire on sonia gandhi and rahul gandhi

రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన నందమూరి హరిక్రిష్ణ రాష్ట్ర విభజన పై కొత్త ఆరోపణ చేశారు. తెలుగుజాతిని విడగొట్టే హక్కు సోనియా గాంధీకి లేదని ఆవేశంగా అన్నారు. సోనియా గాంధీ కేవలం రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిని చెయ్యటానికే తెలుగుజాతిని విభజన చేస్తుందని అన్నారు. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని మీడియా ముందు చెప్పటం జరిగింది. అలాంటి తెలుగు ప్రజలను సోనియా గాంధీ విడదీస్తే ఊరుకొనేది లేదని హరిక్రిష్ణ ఆవేశంగా అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తర్వలో యాత్ర చేపడతానన్నారు. హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారి సమాహారం అని హరికృష్ణ తెలిపారు. అలనాడు మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య శకుని పోషించిన పాత్రను ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్ ను మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని ఆయన పేర్కొన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర విభజన అనేది కేవలం రాహుల్ గాంధీ కోసమే గానీ, తెలంగాణ ప్రజల కోసం కాదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles