Aadhar compulsory for scholarship exams

Aadhar for scholorship exams, Aadhar number, Aadhar card, National means cum merit Scholarships, caste certificates, income certificates, handicapped certificates

Aadhar compulsaory for scholarship exams

ఆధార్ దీనికి కావలసిందే

Posted: 08/21/2013 03:25 PM IST
Aadhar compulsory for scholarship exams

ఎనిమిదవ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకం కింద పరీక్ష రాయదలచుకున్నవారు ఆధార్ నంబర్ ని నమోదు చెయ్యటం అవసరం.  ఈ పరీక్ష నవంబర్ 17న జరగబోతోంది.  దానికి దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 10.

ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు మన్మధరెడ్డి, ఆధార్ కార్డ్ అందనివారు అప్లికేషన్లో ఆధార్ ఇఐడి నంబర్ (ఆధార్ నమోదు చేసినప్పుడు ఇచ్చే రసీదులో ఉన్న తాత్కాలిక నంబర్) నైనా అందులో రాయవలసివుంటుందని అన్నారు. 

అప్లికేషన్లను ప్రాసెస్ చెయ్యటంలో సౌలభ్యం కోసం వారి వారి సర్టిఫికేట్లను కులం, ఆదాయం, అంగవైకల్యానికి సంబంధించినవాటిని జతచేయ వలసి ఉంటుందని కూడా మన్మధ రెడ్డి అన్నారు.  అంతేకాదు, అలా ధృవీకరణ పత్రాలను జతపరచని దరఖాస్తులను తీసుకోవద్దని కూడా ప్రధానోపాధ్యాయులకందరికీ సూచనలిచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles