Godavari samaikyanadam

Godavari Samaikyanadam, Samaikyandhra movement, Rajahmundry samaikya sabha, samaikyandhra in Seemandhra, Gazal Srinivas

Godavari Samaikyanadam

ఉర్రూతలూగించిన ఉద్యమ వేడుక

Posted: 08/21/2013 04:19 PM IST
Godavari samaikyanadam

ఉద్యమమే కానీ వేడుకలా జరిగింది రాజమండ్రిలో సమైక్యవాద నినాదం.  గోదావరి సమైక్యనాదం పేరుతో ఏర్పాటైన సభలో సమైక్యవాదాన్ని బలపరుస్తూ మా తెలుగు తల్లికి మల్లె పూదండ గానాన్ని ఆలపించారు.  25 వేల మంది విద్యార్థులు అందులో గళం కలిపారు.  

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ సభలో గజల్ శ్రీనివాస్ విశేష ఆకర్షణగా నిలిచి పాటలు పాడి అందరినీ ఉత్సాహపరచారు.  విడిపోతే ఏమున్నది అంతా కలిసుంటేనే కదా ఐక్యత అంటూ సమైక్య పథంలో నడవటానికి ప్రోత్సాహంగా పాడారు.  విద్యార్థులు కూడా పాటలు పాడారు.

ఈ సభలో విచిత్ర వేషధారణలు, నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించి విద్యార్థులను ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత ర్యాలీ నిర్వహించి లాలా చెరువు వరకూ నడిపించారు.  జాతీయ రహదారి మీద మానవహారాన్ని ఏర్పరచి సమైక్యావాదానికి అనుకూలంగా నినాదాలు చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles