Food security bill pushed back by missing coal files

Food Security Bill, Coalgate scam, Coal files missing, CBI wants Coal files, Prime Minister accused missing files, Coal Minister Jaiswal, 60 coalgate files missing

Food Security Bill pushed back by missing coal files

బొగ్గు ఫైళ్ళకు రెక్కలు, అటకెక్కుతున్న ఆహార భద్రత

Posted: 08/20/2013 05:30 PM IST
Food security bill pushed back by missing coal files

బొగ్గు కుంభకోణాన్ని ఎత్తి చూపే ఫైళ్ళకి రెక్కలు వచ్చాయి.  మొత్తం 60 ఫైళ్ళు దోబూచులాడుతున్నాయో లేక అంతరించిపోయాయో తెలియదు కానీ కంటికి మాత్రం కనిపించటంలేదు.  బొగ్గు కేటాయింపులలో ప్రత్యక్ష దోషిగా పేర్కొంటున్న ప్రధానమంత్రి మీద మాటలతో దాడి చేస్తూ ఉభయసభలలోనూ ఆందోళనలు చెలరేగగా సభలు పలుమార్లు వాయిదా పడి చివరకు రేపు రాఖీ పండుగ శలవు కావటం వలన ఎల్లుండికి వాయిదాపడింది. 

ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టాలని గంపెడాశతో సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆశాదీపాన్ని బొగ్గుపులుసు వాయువు ఆర్పేసింది.  గల్లంతైన ఫైళ్ళ విషయంలో ప్రధానమంత్రి స్వయంగా వివరణనివ్వాలని ప్రతిపక్షాలు పట్టుపట్టగా, అది కుదరదని, ఆ ఫైళ్ళ గురించి తన మంత్రిత్వ శాఖ విచారణ జరిపి వివరాలను వెలికి తీస్తుందని బొగ్గు శాఖామాత్యుడు జైస్వాల్ అన్నారు. 

అంతేకాదు, నేరం ఋజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కూడా జైస్వాల్ అన్నారు.  కొన్ని పదాలను మనం అనాలోచితంగా వాడుతుంటాం.  అందులో ఇది ఒకటి.  నేరం ఋజువైతే శిక్ష ఎలాగూ పడుతుంది.  అప్పుడు నేరస్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేదదే.  ఇక రెండవది, నేరం ఋజువైతే అంటే అప్పటిదాకా తాము నేరస్తులో కాదో వాళ్ళకే తెలియదా.  మేము నేరం చెయ్యలేదు అని చెప్పటం వేరు, నేరం ఋజువుకాలేదుగా అనటం వేరు. 

ఫైళ్ళు గల్లంతైతే బొగ్గు శాఖ ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిందా అని భాజపా నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు.  60 ఫైళ్ళు మాయమవగా, అందులో 16 ఫైళ్ళు దర్యాప్తు సంస్థ సిబిఐ కోరటం విశేషం.  ఆ 16 ఫైళ్ళుంటేనే కానీ సిబిఐ దర్యాప్తు ముందుకెళ్ళదన్నమాట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles