Modi challenges pm to a debate on development

Narendra Modi,prime minister,Manmohan singh,independence day,Independence Day, Manmohan Singh, Narendra Modi, BJP, Food Security Bill, Corruption, Pakistan

Pitching himself firmly as BJP's prime ministerial candidate even before being formally anointed, Narendra Modi today launched a blistering attack on Prime Minister Manmohan Singh on national security and challenged him to a public debate on

బహిరంగ చర్చకు సిద్దమా ? ప్రధానికి మోడీ సవాల్

Posted: 08/15/2013 04:06 PM IST
Modi challenges pm to a debate on development

బీజేపీ ఎన్నికల రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వాంత్రత్య దినోత్సవ సంధర్భంగా జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడిన ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ని టార్గెట్ చేసి మాట్లాడు. స్వాంతంత్ర్య సభ వేధిక సాక్షిగా ఆయన ప్రధానికి దమ్ముంటే సుపరిపాలన, అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని ప్రధాని మన్మోహన్ సింగ్ను సవాలు చేశారు. యావద్దేశం తన ప్రసంగాన్ని ప్రధాని ప్రసంగంతో పోల్చి చూసుకుంటుందని నిన్ననే చెప్పిన మోడీ.. అనుకున్నట్లే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్, చైనా ఎంత రెచ్చగొడుతున్నా భారతదేశం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రధానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనీయులు మన భూభాగంలోకి వస్తున్నా మనం మాత్రం నోరు మెదపట్లేదని, ఇటాలియన్ సైనికులు వచ్చి మన మత్స్యకారులను చంపేసినా, పాకిస్థానీలు మనవాళ్ల తలలు నరుక్కెళ్లినా పట్టించుకోవట్లేదంటూ భుజ్ వేదికపై నిప్పులు కురిపించారు. దేశం మార్పు కోసం అవిశ్రాంతంగా ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు. సుపరిపాలన, అభివృద్ధి అంశాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ప్రధానమంత్రిని మోడీ సవాలుచేశారు. 'మీరు పెద్ద దేశాన్ని పాలిస్తున్నారు, నేను చిన్న రాష్ట్రాన్ని పాలిస్తున్నా. అభివృద్ధి, సుపరిపాలన అంశాలపై ప్రధాని దమ్ముంటే చర్చకు రావాలి. ఢిల్లీ సర్కారుకు, గుజరాత్కు మధ్య పోటీ జరగాలి అని ఆయన అన్నారు. ఇప్పుడు మోడీ ప్రధాని పై చేసిన సవాల్ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles