Ministers wives meet governor over state bifurcation

Ministers wives meet Governor over state bifurcation, Ministers wives meet Governor over state bifurcation, Telangana granted statehood, A.P bifurcated, A.P NGOs Samme, samaikhyandhra agitation, A.P NGO

Ministers wives meet Governor over state bifurcation, Ministers wives meet Governor over state bifurcation, Telangana granted statehood, A.P bifurcated, A.P NGOs Samme, samaikhyandhra agitation, A.P NGO

సీమాంధ్ర ఉద్యమంలో మంత్రుల భార్యలు

Posted: 08/13/2013 02:55 PM IST
Ministers wives meet governor over state bifurcation

రాష్ట్రాన్ని విభజించ వద్దని సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి, ఉద్యమాన్ని నడిపిస్తుంటే... వారి సతీమణులు కూడా మేం సైతం అంటూ ఉద్యమంలో భాగంగా తమ వంతుగా గవర్నర్ నరసింహన్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మంత్రి శైలజానాథ్ సతీమణి మోక్ష, మాజీ మంత్రి మారెప్ప, ఆనం వారి కుటుంబం నుండి సుచరితా రెడ్డి వంటి వారు గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ని కలిసిన అనంతరం మీడియా తో మోక్ష మాట్లాడారు. తాము హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేమని రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని, విభజన జరిగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని సాకె మోక్ష అన్నారు. తమ ప్రాంతంలో విద్యాసంస్థలు, కంపెనీలు లేవన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన జరిగిందన్నారు.  తమ ప్రాంత ప్రజల బాధ చెప్పాలనే తాము గవర్నర్‌ను కలిశామన్నారు. విభజన వద్దని తాము గవర్నర్‌ను కోరామని సామినేని విమల చెప్పారు. ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని దెబ్బతీయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప సతీమణి రాణి అన్నారు. సమైక్యరాష్ట్రం కోసం వీరు కూడా ముందు రావడంతో మంత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles