Samaikyandhra movement intensified

Samaikyandhra movement intensified, NGOs strike, RTC workers strike, Seemandhra employees strike, TDP leaders in Parliament, Seemandhra Petrol, Seemandhra Congress Leaders protest, pumps closed

Samaikyandhra movement intensified

మరింత ఊపందుకున్న సీమాంధ్రుల సమ్మె

Posted: 08/13/2013 11:28 AM IST
Samaikyandhra movement intensified

అర్ధరాత్రి నుంచి ఎన్జీవోల సమ్మె ప్రారంభం కావటంతో సీమాంధ్ర ఉద్యమం మరింత ఊపందుకుంది.  ఆర్ టి సి లోని 6600 కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతు తెలపటంతో 123 డిపోలలో 12000 బస్సులు నిలిచిపోతున్నాయి.  విజయవాడ రీజియన్ లోనే 32 డిపోలకు చెందిన 3300 బస్సులు కృష్ణా జిల్లాలో 14 డిపోలలో 1356 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

సంవత్సరాలలో జరగని విధంగా తిరుమల కొండలకు ప్రయాణీకులను తీసుకెళ్ళే బస్సులు కూడా నిలిచిపోయాయి.  ఆర్ టి సి ఈ విషయాన్నే ముందుగానే ప్రకటించినా అది తెలియని ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రయాణీకులకు, జనస్రవంతికి ఇబ్బంది కలుగుతున్నా, ఇది తాత్కాలికమేనని, ఇప్పుడు కాని గళాలు విప్పకపోతే పరిస్థితి చెయి దాటిపోతుందని, ఆ తర్వాత చెయ్యగలిగేదేమీ ఉండదని, అప్పుడు కలిగే ఇబ్బందులు శాశ్వతంగా ఉంటాయని ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు, అర్ టి సి కార్మిక నాయకులు అన్నారు. 

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో ఆందోళన ఉధృతంగా ఉంది.  విశాఖలో జనజీవనం పూర్తిగా స్థంబించిపోయింది.

సమైక్య కు మద్దతుగా పెట్రోలు పంపులు కూడా 24 గంటలు బంద్ పాటిస్తున్నాయి.  నిన్న రాత్రి పెట్రోలు కోసం అర్ధ రాత్రి వరకూ వాహనాలు బంక్ ల దగ్గర క్యూలు కట్టాయి.

సీమాంధ్ర తెలుగు దేశం పార్టీ సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు.  వారంతా సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం రాసివున్న టి షర్ట్ లను ధరించి పార్లమెంటులో ప్రవేశించారు.  ప్లకార్డులతో వెల్ లోకి వెళ్ళారు అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం పార్లమెంటులో కొనసాగుతూనేవుంది.  రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 12.00 వరకు వాయిదా పడింది. 

సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు.  అది జంతర్ మంతర్ లో చెయ్యాలా మరెక్కడ చెయ్యాలన్న విషయాన్ని నిన్నటి వరకు నిర్ణయించుకోలేదు.  ఈ రోజు పార్లమెంటులో గాంధీ విగ్రహం దగ్గర చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles