Ap ngo leader ashok babu with media on strike

AP NGO Leader, Ashok Babu, Media, Samaikyandhra,

AP NGO Leader Ashok Babu With Media on Strike for Samaikyandhra.

ఫలించని చర్చలు... నేటి రాత్రి నుండే సమ్మె

Posted: 08/12/2013 07:29 PM IST
Ap ngo leader ashok babu with media on strike

కేంద్రం రాష్ట్ర విభజన ఏర్పాటు పై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు ఈనెల 12 తేదీ నుండి మెరుపు సమ్మెకు దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. వారు ప్రకటించిన ప్రకారం సమ్మె యాధాతథంగా జరుగుతుందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ రోజు అర్ధ్ర రాత్రి నుండే సమ్మె మొదలవుతుందని, ఈ సమ్మెలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ సిబ్బంది, సహకార సంస్థల సిబ్బంది పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మెను ఆపేందుకు ప్రభుత్వం వారితో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ రోజు మంత్రి వర్గ ఉప సంఘంతో జరిగిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు సీమాంధ్ర సమస్యలు ఆంటోని కమిటీకి వివరించే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని మంత్రి వర్గం కోరిందని అందుకు తాము ఒప్పుకేలేదని, ఎక్కడా తగ్గేది లేదని తేగేసి చెప్పినట్లు ఆయన చెప్పారు. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభమవుతుందని, ఎక్కడ బస్సులు అక్కడ నిలిచిపోతాయని ఆశోక్‌బాబు స్పష్టం చేశారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో సహా మంత్రులు ఆనం రాం నారాయణ  రెడ్డి, పితాని సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రకటనను వెనక్కి తీసుకునేంత వరకు శాంతియుత మార్గంలో సమ్మె కొనసాగుతుందని వారు స్పస్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles