Tdp chief chandrababu naidu to visit delhi today

TDP chief Chandrababu Naidu, Chandrababu Naidu to visit Delhi, Telangana Issue, Prime Minster Dr Manmohan Singh, President Pranab Mukherjee

Telugu Desam Party president N Chandrababu Naidu will reach the national capital on Monday evening on a two-day visit.

బాబు గారు ఢిల్లీకి పరుగెత్తుతున్నారు

Posted: 08/12/2013 04:38 PM IST
Tdp chief chandrababu naidu to visit delhi today

కేంద్రం తెలంగాణ పై ప్రకటన వెలువరించిన అనంతం టీడీపీ అధినేత చంద్రబాబు కాస్తంత ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. అంతక ముందు బాబు తెలంగాణ పై కేంద్రానికి లేఖ రాస్తూ, విభజనకు అనుకూలమే అని చెప్పాడు. దీంతో కేంద్రం ప్రకటన పై సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న టీడీపీ నేతలు స్పందించలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతో అక్కడి నేతలు చంద్రబాబు పై గరం గరంగా ఉన్నారు. తెలంగాణపై లేఖ ఇవ్వడం ద్వారా తాము తీవ్రస్థాయిలో దెబ్బతిన్నామని, పార్టీ ఇక కోలుకునే అవకాశం లేదని నేతలంతా మండిపడటంతో చంద్రబాబు హస్తినకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ప్రణబ్‌ముఖర్జీని, ప్రధాని మన్మోహన్‌ను కలవాలని నిశ్చయించారు. ఇప్పటికే విభజన పై కేంద్రానికి లేఖ రాసిన బాబు ఇఫ్పుడు హస్తినకు పయనం అవుతుండటంతో ఇటు తెలంగాణ టీ నాయకులు కోపంగా ఉన్నారు. మరోవైపు  సీమాంధ్ర నేతలతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles