Nandamuri harikrishna open letter to telangana state division

harikrishna open letter to telangana state, nandamuri harikrishna open letter to telangana state, nandamuri harikrishna, tdp, talangana state, tealangana issue, congress party,

nandamuri harikrishna open letter to telangana state division

టిడిపి సీతయ్య విభజన పై బహిరంగ లేఖ

Posted: 08/02/2013 06:42 PM IST
Nandamuri harikrishna open letter to telangana state division

రాష్ట్ర విభజన అంశంపై తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ విభజనను ఒక ప్రాంత ప్రజాభీష్టానికి తలవంచి అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబం విడిపోయేటప్పుడు పెద్దమనషులు సమక్షంలో ఆస్తులు పంచుకునే సంప్రదాయం ఉంటుందని, సంప్రదింపులు, సమాలోచనలు లేకుండా ఒక ప్రాంతాన్ని నిర్థాక్షిణ్యంగా నడిరోడ్డు పైకి నెట్టివేస్తారా అని హరిక్రిష్ణ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి పంపకాలు సక్రమంగా లేక సీమాంద్ర నష్టపోయిన విషయాన్ని మరిచారా అని ఆయన ప్రశ్నించారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండంటూ తెలుగు ప్రజల మద్య సోనియా చిచ్చుపెట్టారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ విభజనకు వ్యతిరేకం కాదని, అయితే ఒక కంటికి కారం, మరో కంటికి కాటుక పెట్టే ద్రుష్ట సంప్రదాయం టిడిపికి లేదని ఆయన అన్నారు. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు నింపిన రాజకీయ శక్తి సోనియాకే చెల్లిందని సీతయ్య అన్నారు. టిడిపిది కన్నపేగు మమకారమని ఆయన అన్నారు. ఇచ్చాపురం నుంచి హిందుపురం వరకు బీళ్లుగా లక్షలాది ఎకరాల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. వర్షాకాలంలో కూడా కరెంటు లేక చీకట్లో మగ్గుతున్న సీమాంద్ర ప్రజలకు వెలుగులు ఎక్కడ ఉన్నవి అని సీతయ్య ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న ఉప్పు సముద్రం చూసి సీమాంద్ర ప్రజలు త్రుప్తి పడాలా అని హరిక్రిష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles