Godavari floods devastate again

Godavari floods devastation, Bhadrachalam floods, Bhadrachalam division floods, Kunavaram floods, Charla floods, Venkatapuram floods, Vajeedu floods

godavari floods devastate again

మరోసారి ఉగ్రరూపాన్ని చూపిస్తున్న గోదావరి

Posted: 08/02/2013 02:47 PM IST
Godavari floods devastate again

ఈ సంవత్సరంలో రెండవసారి గోదావరి దడ పుట్టిస్తోంది.  మొదటిసారి కూడా సుదీర్ఘంగా వచ్చిన వరదలు ఖమ్మం ఆదిలాబాద్ జీల్లాలలో జనజీవనాన్ని అతలాకుతలం చేసాయి. 

ఈ రోజు ఉదయం భద్రాచలం లో నీటి మట్టం 58 అడుగులకు చేరి ప్రమాద ఘంటికలను మోగించింది.  భద్రాచలం డివిజన్ లో భద్రతా దృష్ట్యా ఎనిమిది మండలాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేయవలసి వచ్చింది.  వాగులు కూడా పొంగటంతో ఎక్కడికక్కడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన గ్రామాలు వాజేడు మండలంలో 35, చర్ల మండలంలో 4, వేలేరుపాడు మండలంలో 25.  ఆయా గ్రామాల మధ్య రాకపోకలు కానీ సమాచార సంపర్కం కానీ లేకుండాపోయింది.  వెంకటాపురంలో, చింతుకూరు మండలంలో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చర్ల దగ్గర తాలిపేరు వాగు పొంగటంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.  అది మళ్ళీ గోదావరిలోనే కలిసేది.  ఇలాంటి ఎన్నో వాగులు కలవటమే కాకుండా భద్రాచలానికి దిగువలో ఉన్న శబరి ఉపనది వలన కూడా గోదావరి పెరగటం విశేషం.  శబరి నది పొంగినప్పుడు దాని ప్రవాహ వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే గోదావరి నదీ ప్రవాహాన్నే నిలిపివేస్తుంది.  అందువలన భద్రాచలానికి దిగువలో ఉన్న శబరి వలన కూడా ఒక్కోసారి భద్రాచలం లో నీటి మట్టం పెరిగిపోతుంటుంది. 

జన జీవనం స్థంబించటమే కాకుండా ఆహార పదార్థాలు, తాగటానికి నీరు లేక బాధపడటంతో పాటు ఎక్కువ కాలం నీరు నిలువ ఉండటంతో గ్రామాలలో వ్యాధులు కూడా వ్యాపిస్తుంటాయి. 

ఈసారి రెవిన్యూ శాఖవారికి చేతినిండా పనిపడింది.  ఒకపక్క వరదలు, మరో పక్క పంచాయతీ ఎన్నికలతో సిబ్బంది సతమతమవుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles