Cm asks collectors to work on warfooting basis

Heavy rains floods in AP, Flood hit areas in AP, National Disaster Response Force, Floods in Telangana, Floods at Bhadrachalam, Konaseema Islands in floods

CM asks collectors to work on war-footing basis

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

Posted: 07/22/2013 12:01 PM IST
Cm asks collectors to work on warfooting basis

ఎడతెరపిలేని వర్షాలు, గ్రామాలు గ్రామాలను ముంచేస్తున్న వరదలు, తెగిపోయిన రాకపోకలు, భద్రతా దృష్ట్యా విద్యుత్తు కోతలు వీటితో సతమతమౌతున్న వివిధ జిల్లాలలోని రాష్ట్ర ప్రజలకు కొన్ని చోట్ల అధికారుల నుంచి సహాయం అందుతోంది, కొన్ని చోట్ల లేదు, అందిన చోట కూడా నామమాత్రంగానే జరుగుతోంది కానీ పూర్తిగా కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్నఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు.

అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కలెక్టర్ల నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీ పి.కె.మొహంతి తో కలిసి వరద ముంపు ప్రాంతల గురించి వివరాలను తీసుకున్నారు.  పరిస్థితిని సమీకరించిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చెయ్యాలని కలెక్టర్లను కోరారు. 

గోదావరి ఉధృతి ఉత్తర తెలంగాణా, భద్రాచలం ప్రాంతాలలో తగ్గు ముఖం పట్టింది.  జలమయమైన కోనసీమ లంకప్రాంతాల్లో నిన్న ఆర్మీ హెలికాప్టర్లలో ఆహార పొట్లాలను జారవిడిచారు.  ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలలో నాలుగు హెలికాప్టర్లలో సహాయక బృందం సహాయాన్ని అందించారు. 

జాతీయ విపత్తు సహాయక సంస్థ సేవలను ఎక్కువ చేసారు.  వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శరణాలయాలను ఇప్పటికే ఉన్న 70కి మరో 30 ని జోడించారు.  అందులో భోజనాది సదుపాయాలను చేసారు.

అయితే సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికమీద కొనసాగించవలసిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles