Unanimous elections in a number of panchayats

Unanimous elections, panchayats elections, Congress, Telugu Desam Party, Finance minister, Panchayat polls, ysr congress

On the last day of withdrawal of nominations for the Gram Panchayat elections, the election in a good number panchayats was declared unanimous with a lone contestant remaining in the fray.

పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్

Posted: 07/18/2013 08:22 AM IST
Unanimous elections in a number of panchayats

పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. ఎన్నికలే జరగలేదు పంచాయితీ ఫలితాలు రావడం ఏంటని అనుకోకండి. రాష్ట్రంలో ఉన్న పంచాయితీలలో 2623 పంచాతీల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తంగా చూస్తే అధికార పార్టీ తన అధికార అండతో ముందంజలో ఉండగా, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ కి ధీటుగా సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో వైకాపా తన హవా కొనసాగింది. తెలంగాణలో మాత్రం వైకాపా అంతంత మాత్రంగానే ప్రభావం చూపింది. రాష్ట్రం అంతటా కలిపి 2623 పంచాయతీలలో ఏకగ్రీవంగా సర్పంచ్ లు ఎన్నికైతే వాటిలో వాటిలో కాంగ్రెస్ 700, తెలుగుదేశం పార్టీ 570, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ -400, టిఆర్ఎస్ -88, మిగిలిన సిపిఐ ,సిపిఎం,బిజెపిలకు పది లోపే ప్రధాన పత్రికలు రాసిన కథనాల ఆధారంగా తెలుస్తుంది.

ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవ ఎన్నికలలో కాంగ్రెస్ మొదటి స్థానం, తెలుగు దేశం రెండో స్థానం, వైకాపా మూడో స్థానంలో ఉన్నాయి. కానీ సాక్షి దిన పత్రిక మాత్రం తనకు అనుకూలంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు 855, కాంగ్రెస్ -715, టిడిపి -421 పంచాయతీల స్థానాలు దక్కినట్లు రాసింది. పత్రికల కథనాలు ఎలా ఉన్నా, పార్టీలతో సంబంధం లేకుండా పలు జిల్లాల్లో  పొత్తులు పెట్టుకుంటున్నట్లు సమాచారం. విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్,టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పొత్తులు పెట్టుకుంటున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయని సమాచారం .చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ ,టిడిపిలు పొత్తు పెట్టుకుంటే, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పొత్తు కుదుర్చుకుంటున్నాయి. తెలంగాణ లోని నల్గొండలో తెలంగాణ ఐకాస 4 స్థానాలను గెలుచుకోవడం విశేషం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పలు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల ఫలితాలను బట్టే అసెంబ్లీ ఎన్నికల పై అంచనాకు వస్తాయి. కానీ పలు పార్టీలు కుమ్మక్కై ఇలా ఏకగ్రీవం కావడంతో ఏ పార్టీ పై ప్రజలు సుముఖంగా ఉందో తెలియక పలు పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles